“అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా మే 31 గురువారం ఉదయం రాజానగరంలో అవగాహనా ప్రదర్శన జరిగింది. జిఎస్ఎల్ డెంటల్ కాలేజి, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ (ఐడిఎ) లక్ష్మీపురం బ్రాంచీల సంయుక్త అధ్వర్యంలో రాజానగరం పంచాయతీ ఆఫీసునుంచి జిల్లాపరిషత్ హైస్కూలు వరకూ జరిగిన ఊరేగింపులో పొగాకు అనర్థాలను వివరించే పాంప్లెట్లను దారిపొడవునా పంచారు. దాదాపు 200 మంది పాల్గన్న ఊరేగింపులో ముఖ్యకూడళ్ళవద్ద పాటలతో చిన్నచిన్న స్ట్రీట్ ప్లేలతో పొగాకు అనర్జాలను జిఎస్ఎల్ డెంటల్ కాలేజి విద్యార్ధులు వివరించారు.
ఐడిఎ లక్ష్మీపురం బ్రాంచ్ అధ్యక్షుడు డాక్టర్ మాణిక్యం, కార్యదర్శి డాక్టర్ హరికృష్ణ, డెంటల్ కాలేజి ప్రొఫెసర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చివరగా పొగాకు దుష్ఫలితాలను వివరించేలా జిఎస్ఎల్ డెంటల్ కాలేజి విద్యార్ధులు రూపొందించిన ఒక షార్ట్ ఫిల్మ్ ను యుట్యూబ్ లో అప్ లోడ్ చేశారు