వెనక్కి తిరగొద్దు – మీరే అజేయులు

0
1663

డెంటల్ విద్యార్ధులకు జాతీయ స్ధాయి నిపుణుని పిలుపు

ముందే నిర్ణయించుకున్న విధంగా విద్య, ఉద్యోగ, వృత్తులలో ప్రవేశించగల అవకాశాలు వ్యవస్ధాగతంగా మనదేశంలో లేవని, మిగిలిన అవకాశాలు లేదా పరిస్ధితుల వల్ల చేరిన కోర్సులో వెనుదిరుగకుండా కృషి చేస్తే ఆ రంగంలో అజేయులు, అద్వితీయులుగా నిలుస్తారని బెంగుళూరులో సుప్రసిద్ధ దంత వైద్యుడు, మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ కృష్ణమూర్తి బొనంతయ్య అన్నారు.

రాజానగరం వద్దగల జిఎస్ఎల్ డెంటల్ కాలేజి లో శనివారం సాయంత్రం జరిగిన “2018 ఫ్రెషర్స్ డే” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ మొదలైన టెక్నాలజీలు తమతరానికి లేని ఈ తరానికే వున్న అద్భుత అవకాశాలని అన్నారు. ఇట్లాంటి టెక్నాలజీలు ఇప్పటికే వున్న జిఎస్ఎల్ డెంటల్ కాలేజిని ఎంపిక చేసుకోవడం విద్యార్ధులు తల్లిదండ్రుల అదృష్టమన్నారు.

అధ్యక్షత వహించిన జిఎస్ఎస్ వైద్య, వైద్య విద్యా సంస్ధల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు మాట్లాడుతూ వచ్చే ఏడాది చివరికల్లా 8 డెంటల్ పిజి కోర్సులు వచ్చేలా కృషి చేయగలమన్నారు.

జిఎస్ఎల్ డెంటల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ సునీల్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, జిఎస్ఎల్ సంస్ధల డీన్ డాక్టర్ వైవి శర్మ, జిఎస్ఎల్ మెడికల్ కాలేజి ప్రిస్సిపాల్ డాక్టర్ గురునాధ్, జిఎస్ఎల్ సంస్ధల డైరక్టర్లు డాక్టర్ గన్ని సందీప్, జిఎస్ రామకృష్ణ, పెద్దాడ నవీన్ పాల్గొన్నారు.

స్వచ్ఛతకు, అంకితభావానికీ సంకేతమైన తెల్లకోట్లను అతిధుల ద్వారా డెంటల్ విద్యార్ధులకు యాజమాన్యం బహుకరింపచేసింది.

పిల్లల అటెండెన్సు, ప్రవర్తనలపై తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలని ప్రిన్సిపాల్ డాక్టర్ సునీల్ కోరారు.

ముందుగా అతిధులు జ్యోతివెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చివరిగా రెండుగంటలకు పైగా విద్యార్ధులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here