సిములేషన్ జ్ఞానం మార్పిడి
జిఎస్ఎల్ తో 2 విదేశీ సంస్ధల ఒప్పందం

0
641609

జిఎస్ఎల్ మెడికల్ కాలేజిలోగల జిఎస్ఎల్ స్మార్ట్ లాబ్ కు రెండు విదేశీ సంస్ధలకు మధ్య నాలెడ్జ్ ఎక్చేంజ్ ఒప్పందాలు కుదిరాయి.

ఈ మేరకు ఇంగ్లాండ్ లోని “హల్” మెడికల్ యూనివర్సిటీ నుంచి, అలాగే బర్మింగ్ హామ్ లోని “ఏస్పి”(అసోసియేషన్ ఫర్ సిములేటెడ్ ప్రాక్టీసు ఇన్ హెల్త్ కేర్) నుంచి మెడికల్ సిమ్యులేషన్ లో విజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు వైద్యవిద్యార్ధులు, ప్రొఫెసర్లు, జిఎస్ఎల్ స్మార్ట్ లాబ్ కు వస్తారు. అలాగే స్మార్ట్ లాబ్ నుంచి ఆరెండు సంస్ధలకు వెళుతారు.

జిఎస్ఎల్ సంస్ధతరపున డాక్టర్ గన్ని సందీప్, డాక్టర్ గన్ని భాస్కరరావు, “హల్” తరపున డాక్టర్ ఎన్ ఎస్ మూర్తి “ఏస్పీ” తరపున డాక్టర్ పూరవ మకాని సంతకాలు చేశారు. జాతీయ మెడికల్ సిములేషన్ సమ్మేళనం “సిముల్ కాన్ 2019” ముగింపు రోజు శనివారం ఆ ఒప్పంద పత్రాలను పరస్పరం మార్పిడి చేసుకున్నారు.

ఈ పరిణామాన్ని “భారతదేశంలో మెడికల్ సిములేషన్ నెక్స్ట్ లెవెల్ కి చేరింది. డాక్టర్ గన్ని భాస్కరరావు విజన్ వల్లే ఇది సాధ్యమైంది” అని డాక్టర్ ఎన్ ఎస్ మూర్తి వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here