వైద్యవిద్యల్లో చికిత్సల్లో
సిమ్యులేషన్ అనివార్యం

0
2156

వైద్యవిద్యార్ధలు అధ్యయనం చేయడానికి, వైద్యులు చికిత్సలు చేయడానికి వీలుగా మానవ శరీరనిర్మాణం, వ్యాధులు, చికిత్సావిధానాలను కృత్రిమంగా నిర్మించే మెడికల్ సిమ్యులేషన్ కు భవిష్యత్తులో వున్న అనివార్యతల గురించి జిఎస్ఎల్ మెడికల్ కాలేజిలో చర్చజరుగుతోంది.

సిములేషన్ రంగంలో పనిచేస్తున్న వేర్వేరు విభాగాల వారి ప్రాతినిధ్యంతో రెండురోజుల దేశంలోనే మొట్టమొదటి జాతీయ సమ్మేళనం “సిముల్ కాన్” ఈ కాలేజిలో శుక్రవారం ప్రారంభమైంది. మొదటి రోజు ఈ రంగంలోని వేర్వేరు అంశాలపై జరిగిన చర్చావేదికల మీద ఏడుగురు ప్రముఖులు మాట్లాడారు.

అమెరికా నుంచి వచ్చిన ఆదేశపు సిములేషన్ సొసైటీ అధ్యక్షురాలు, అనస్ధీషియాలజిస్ట్ అయిన డాక్టర్ క్రిస్టినా పార్క్ మాట్లాడుతూ “ ఇలాంటి సమ్మేళనాలు సిములేషన్ రంగంలో దేశంలోని ఇతర కేంద్రాలకు మార్గదర్శకాలు అవుతాయి. ఇప్పటికే అమలులో వున్న విధానాలు ప్రమాణీకాలు అయ్యేందుకు దోహదపడుతాయి” అన్నారు.

ముంబాయి నుంచి వచ్చిన డాక్టర్ నితిన్ సిప్పీ భారీ వ్యయాలతో నిర్మించిన సిములేషన్ లేబరేటరీలను ఆర్ధికంగా స్వయం పోషకాలుగా నిర్మించుకోవలసిన అవసరాన్ని అందుకు మార్గాలను వివరించారు.

సిములేషన్ పరికరాలను పంపిణిచేసే సంస్ధ లేడరల్ ప్రతినిధి డాక్టర్ లక్ష్మీ ఆరాధ్య – మెడికల్ సిములేషన్ గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తును వివరించారు.

మలేషియా నుంచి వచ్చిన ఇస్మాయిల్ సైబూన్ అత్యవసర ప్రాణరక్షణ చికిత్సల్లో మెడికల్ సిములేషన్ ఉపయోగపడిన అనుభవాలను, ఉదాహరణలను చెప్పారు.

మలేషియానుంచి వచ్చిన నరేంద్రియన్ కృష్ణస్వామి ఇప్పటి వరకూ వున్న అనుభవాలను బట్టి మెడికల్ సిములేషన్ పరికరాలను కోర్సులను ఎలా పునర్మించవచ్చో సూచనలు చేశారు.

యుకె నుంచివచ్చిన ఆమండా విల్ ఫోల్డ్ నర్సింగ్ కోర్సుల్లో, సర్వీసుల్లో తన అనుభవాలను వివరించారు. వాటిని భారతదేశంలో అమలు చేయడానికి మార్గాలను ఆమె సూచించారు.

యుకె నుంచి వచ్చిన ఆదేశపు సిములేషన్ సొసైటీ “ఎఎస్ పి అధ్యక్షురాలు పురవమకాని మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వున్న మెడికల్ సిములేషన్ ఆచరణలు అనుభవాలు భారతదేశానికి ఎలా ఉపయోగపడగలవో ఈ సమ్మేళనం మార్గదర్శనం చేయాలని ఆకాంక్షించారు.

యుకె నుంచి వచ్చిన సర్జన్ డాక్టర్ ఎన్ ఎస్ మూర్తి , జిఎస్ ఎల్ సిముసేషన్ లేబొరేటరీ డైరక్టర్ డాక్టర్ గన్ని సందీప్ సదస్సులకు, చివరగా జరిగిన ప్రశ్నోత్తరాల “కాఫీ టేబుల్” సమావేశానికి మోడరేటర్లుగా వ్యవహరించారు.

జిఎస్ఎల్ మెడికల్ కాలేజి చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు, డీన్ డాక్టర్ వైవి శర్మ, ప్రిన్సిపాల్ డాక్టర్ గురునాధ్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ టివిఎస్ పి మూర్తి ఈ కార్యక్రమాలను నిర్వహించి సమీక్షలు చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here