మెడికల్ సిములేషన్ ను
రెండో దశకు చేరుస్తున్న జిఎస్ఎల్

0
1806

భారతదేశంలో మెడికల్ సిమ్యులేషన్ ప్రాధమిక దశనుంచి రెండోదశకు అడుగుపెడుతోందని అరంగంలో పనిచేస్తున్న అనుభవజ్ఞులు, నిపుణులు అభిప్రాయ పడ్డారు.

రాజమండ్రి వద్ద జిఎస్ఎల్ మెడికల్ కాలేజిలో రెండురోజులపాటు జరిగిన జాతీయ మెడికల్ సిమ్యులేషన్ సమ్మేళనం “సిముల్ కాన్” కు రిసోర్స్ పర్సన్స్ గా ఫాకల్టీలుగా 13 దేశాలనుంచి వచ్చిన ప్రముఖులు ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

వైద్యశాస్త్ర అధ్యయనాలు చికిత్సా విధానాలపై ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా డాక్టర్లు మాత్రమే ఇప్పటివరకూ పని చేస్తున్నారు. అయితే, డాక్టర్లు, డెంటిస్టులు, ఫిజియోధెరపిస్టులు, నర్సులు, విడివిడిగా కాకుండా ఒకే వేదిక మీద సమీకృతంగా పనిచేసే వాతావరణం ఇక్కడ కనిపిస్తోందని, ఇందుకు జిఎస్ఎల్ స్మార్ట్ లాబ్ ద్వారా డాక్టర్ గన్ని భాస్కరరావు, డాక్టర్ గన్ని సందీప్ మార్గదర్శనం చేశారని డాక్టర్ ఎన్ ఎస్ మూర్తి చెప్పారు. గ్యాస్ట్రోఎంటరాలజిస్టు, సర్జన్ అయిన డాక్టర్ మూర్తి ఇంగ్లాండ్ నుంచి వచ్చారు.

యుకెలో సిములేషన్ సొసైటి అధ్యక్షురాలు, డాక్టర్ పూరవ మకాని మాట్లాడుతూ “ మెడికల్ సిములేషన్ ఎక్కడికక్కడ ఆయా నిపుణులు, అనుభవజ్ఞుల చొరవ తెలివితేటల ఆధారంగా నిలదొక్కుకుని విస్తరిస్తోంది. ఈ విద్యను ప్రమాణీకరించడానికి తగినన్ని వైవిధ్యం వున్న కేసులు అనుభవాలు మన ముందు వున్నాయి. వీటన్నిటినీ క్రోడీకరించి ప్రొటోకాల్సు మార్పుచేయడమో, రూపొందించడమో ప్రామాణికత అవుతుంది. ఇలాంటి స్టాండర్డైజేషన్ వల్ల మెడికల్ సిములేషన్ విస్తరించే అవకాశం వుందని ఆమె వివరించారు.

సెంటిమెంట్లు, సాంస్కృతిక, సాంప్రదాయిక వాతావరణం మెడికల్ సిములేషన్ విస్తరణకు అవరోధమౌతుందన్న వాదనను పాండిచేరినుంచి వచ్చిన డాక్టర్ దినకర్ పాయ్ తోసిపుచ్చారు. సిములేషన్ వల్ల మంచి ఫలితాలను చూపించే కొద్దీ సెంటిమెంట్లు వెనక్కి పోతాయన్నారు.

అమెరికా సిములేషన్ సొసైటి అధ్యక్షురాలు డాక్టర్ క్రిస్టినా పార్క్ మాట్లాడుతూ అమెరికా, యూరప్ దేశాలతో పోల్చినపుడు వైద్యులు, వైద్య సహాయక సిబ్బంది (పారామెడికల్) ఒకే చోట సమీకృతంగా పనిచేయగల వాతావరణం భారతదేశంలో హెచ్చుగా వుందని, ఇది కొత్తగా విస్తరిస్తున్న మెడికల్ సిములేషన్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళగల అవకాశాలను పెంచుతుందని వివరించారు.

సిముల్ కాన్ ఆర్గనైజింగ్ డైరక్టర్, జిఎస్ఎల్ సంస్ధల వ్యవస్ధాపకుడు డాక్టర్ గన్ని భాస్కరరావు మాట్లాడుతూ మెడికల్ సిములేషన్ పై స్టడీ చేయటానికి 12 దేశాలు తిరిగాము. భారీ ఖర్చులతో లేబొరేటరీ పెట్టాము. మెడికల్ సిములేషన్ అంతిమ లక్ష్యం పేషెంటును మరింత సౌకర్యవంతంగా వుంచడమే అన్నారు.

జిఎస్ఎల్ స్మార్ట్ లాబ్ డైరక్టర్ డాక్టర్ గన్ని సందీప్ మాట్లాడుతూ తమ సంస్ధల్లో, అలాగే ప్రపంచ వ్యాప్తంగా నెలకొంటున్న విస్తరిస్తున్న మెడికల్ సిములేషన్ పై ఫీడ్ బ్యాక్ కోసం మరింత శాస్త్రీయమైన తీసుకోడానికి మరింత శాస్త్రీయమైన విధానాలకోసం అన్వేషిస్తున్నాము అన్నారు. దేశవ్యాప్తంగా మెడికల్ సిములేషన్ లో పిహెచ్ డి చేస్తున్న ఏకైక వ్యక్తి డాక్టర్ సందీప్.

జిఎస్ఎల్ మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ వి గురునాధ్ మాట్లాడుతూ” మా కాలేజి విద్యార్ధుల స్ధాయీ ప్రమాణాలు పెరగడంలో మెడికల్ సిములేషన్ పాత్రవుంది. ఈ ప్రమాణాలను నిలకడగా వికసింపచేసుకుంటూ, సాధిక పరచుకుంటూ రెండేళ్ళు ముందుకు వెళితే జిఎస్ఎల్ మెడికల్ కాలేజి దేశంలోనే అత్యుత్తమ వైద్యవిద్యా సంస్ధ అవుతుంది” అన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here