తీరికలేని డాక్టరై వుండి

0
3131

♦️ ఒక తీరికలేని డాక్టరై వుండి ఎన్నెన్ని సాధిస్తున్నరో! సైక్రియాటిస్ట్ డాక్టర్, కంప్యూటర్ ఇంజనీర్, జర్నలిస్టు-కాలమిస్టు, లాయర్, మేనేజిమెంట్ కన్సెల్టెంట్ మొదలుగా అనేక విద్యల్లో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, ఫెలోషిప్పులు కలిపితే ఈయన డిగ్రీలు 23 అయ్యాయి.

♦️ ఈయన నడిచే జ్ఞానానందం, కదిలే విజ్ఞాన గని, తీరని విద్యల దాహం

♦️ ఈయన సోషల్ ప్రొఫైల్ చాలా పెద్దది, సభలు సమావేశాలు చర్చాగోష్టుల్లో వుంటారు. కాసేపు వర్చువల్ సొసైటీ లోకాన్ని ఫేస్ బుక్ లో చుట్టివస్తారు. పేషెంట్లకు సలహాలుచికిత్సలూ చేస్తూనే వుంటారు. చదువుకుంటూనే వుంటారు.

♦️ ఎవరికైనా రోజుకి ఇరవైనాలుగు గంటలే! ఆకాస్తటైముని ఇన్ని విధాలుగా సర్దుబాటు చేసుకుంటూ ప్రశాతంగా ఆనందంగా వుండటం డాక్టర్ కర్రిరామారెడ్డిగారి మరో విశిష్టత

♦️ ఇంతటి పెద్దాయనకు ఎక్కడైనా నేను కనబడితే బాగున్నావా అని నన్ను పలకరించేటంత పరిచయం వుందని గొప్ప చెప్పుకోడానికే ఇదంతా రాస్తున్నాను కాని డాక్టర్ గారి గురించి నేను కొత్తగా చెప్పవలసిందేమీ లేదు.

♦️ డాక్టర్ గారికి ఇంకో డిగ్రీ వచ్చిందని చెప్పగానే నాభార్య గాల్లోనే దణ్ణం పెట్టి “ఆయన జ్ఞాపకశక్తిలో, జ్ఞానంలో ఓ చెంచాడు నా కొడుక్కి వుంటే బాగుణ్ణు గొప్పగా సెటిలైపోతాడు” అనేసింది….అదీ డాక్టర్ కర్రి రామారెడ్డి గారి ప్రభావం.

♦️ డాక్టరై అందొచ్చిన బిడ్డ “మానస” ఆమె పేరుతోనే వున్న రామారెడ్డిగారి మానస హాస్పిటల్ లో రోగులను చూడటం మొదలుపెట్టి కొద్దికాలంలో మంచి పేరు తెచ్చుకోవడం ఆయనకు పెద్దవెసులు బాటే! వెసులుబాటు కుదిరిందంటే ఆయన మళ్ళీ ఒకటో రెండో కొత్త చదువులు మొదలు పెట్టేస్తున్నారన్నమాటే!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here