కేన్సర్…మూలాలు

0
2553

◆ కాన్సర్ గురించి నాకు తెలుసును అనుకుంటున్న నాలుగు మాటలు చెప్పదలచుకున్నాను. ఈ వ్యాధి ఎంత క్లిష్టమైనదో అవగాహన కల్పించడం నా ఉద్దేశం

◆ తల్లి, తండ్రుల నుండి చెరి సగం Genes కలిసి ఒక కణం (Zygote) తయారవుంటుంది. ఆ ఒక్క కణం (Cell) క్రమేపీ 2, 4, 8, 16, Binary fission ద్వారా కొన్ని మిల్లియన్లు, బిలియన్లు కణాలుగా తయారవు తాయి. ఎలా అంటే తల్లినుండి ఆహారం తీసుకుని మాత్రమే. ప్రతీ రసాయన ప్రక్రియ లో ఆక్సిజన్, Micronutrients తప్పనిసరి. లేనిపక్షంలో ఆ Cell చనిపోతుంది. తల్లి తిన్న ఆహారంలోని పోషకాలు, ఆమె పీల్చిన గాలినుండి ఆక్సీజన్, రెండూ కూడా బిడ్డకు Umbilical Cord ద్వారా మాత్రమే అందిస్తుంది.

◆ అలా తయారయిన బిలియన్ కణాలు ఒకేలా ఉంటే బిడ్డకు ప్రయోజనం లేదు. మీకు 20 Livers, 12 Kidneys అవసరం లేదు. కనుక ఆ కణాలు అన్నీ మార్పు చెంది రకరకాల Tissues గా తయారు అవుతాయి. ఎముక, కండరము, నరాలు, చర్మము, Connective Tissues వగైరా.

◆ అలా తయారయిన Tissues కొన్ని రకాలుగా Combination లో కలిసి గుండె, ఊపిరితిత్తులు, Stomach, కిడ్నీలు, లివర్, బ్రెయిన్, జాయింట్స్, మరెన్నో “అవయవాలు” (Organs) గా మార్పు చెందుతాయి. ఒక్కో అవయవానికి ఒకటి నుండి కొన్ని పదులవరకూ చేయవలసిన Functions (ముఖ్యమయిన పనులు) ఉంటాయి. అవి పని చేయని పక్షంలో ఆ వ్యక్తి కి Liver failure, Heart failure, Kidneys Failure వగైరా వస్తాయి.

◆ ఇందులో కొన్ని అవయవాలు కలిసి ఓకేపని మీద Concentration లో ఉంటాయి. వాటిని Systems అంటారు. Digestive System, Nervous System, Cardiovascular System, Nervous System, Bones and Joints System, Respiratory System, Endocrine System వగైరాలు.

◆ అన్ని కణాలకు, Tissues, అవయవాలు, Systems కీ 24/7 ఆక్సీజన్, Micronutrients కావాలి. లేకపోతే అవి చనిపోతాయి. Heart attack, Brain Stroke అంటే ఇలాంటిదే అన్నమాట. కనుక అన్నిటి కంటే శరీర రక్తప్రసరణ అతిముఖ్యమయిన కార్యం. Heart మన శరీరంలోని రక్తాన్ని అన్నీ అవయవాలకు పంపిస్తుంది. లేనిచో ఇంతే సంగతులు.

◆ చివరగా Cancer గురించి. కాన్సర్ మహమ్మారి Cells, Tissues, Organs, Systems వీటిల్లో దేనినుండి అయినా రావచ్చును. రోగ నిర్ధారణ కూడా కొన్ని సమయాల్లో అంత తేలిక విషయం కాదు. ఇన్ని రకాలుగా ఉన్న కాన్సర్ అన్ని చోట్లా, అన్ని అవయవాల లోనూ ఒకేలా ప్రవర్తిస్తుంది అనుకోవడం మూర్ఖత్వం.

◆ కొన్ని Cancers కి Surgery, Radio Isotopes, Xrays, Chemotherapy, Hormones, చక్కగా పని చేస్తాయి. కొన్ని క్యాన్సర్స్ అస్సలు ఏ పట్టాన లొంగవు. కాన్సర్ ను ఒక కుగ్రామం లో పసరు వైద్యం తో తగ్గిస్తున్నారు అని కొందరు “FRIENDS” పెట్టే Posts చూస్తే చాలా బాధకల్గుతుంది. వారికి నేను ఏరీతిలో, ఏవిధంగా స్పందించాలో కూడా అర్ధం కాదు.

సంకలనం : పెద్దాడ నవీన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here