రోగుల ఆగ్రహాన్ని సానుభూతితో అర్ధం చేసుకోండి

0
1575

రోగుల ఆగ్రహాన్ని సానుభూతితో అర్ధం చేసుకోండి

మెడికోలకు లోక్ సత్తా డాక్టర్ జెపి పిలుపు!

ప్రజారోగ్యసంరక్షణ విధానాల వల్ల, పాలనాపరమైన లొసుగులవల్ల, ఆర్ధికాంశాలవల్లా కూడా బాధితులుగా వుండే రోగుల, వారికుటుంబీకుల ఆగ్రహాన్ని అర్ధం చేసుకుని వారిపట్ల సానుభూతితో వుండాలని లోక్ సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ వైద్యవిద్యార్ధులకు పిలుపు ఇచ్చారు.

వైద్యుడు, మాజీ ప్రభుత్వాధికారి, పరిపాలనా సంస్కర్త, మేధావి అయిన జయప్రకాష్ నారాయణ జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్ విద్యార్ధులతో బుధవారం మద్యాహ్నం సమావేశమయ్యారు. మెడికోల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వైద్యులపై పెరుగుతున్న దాడులపై ప్రశ్నకు బదులిస్తూ రోగుల ఆగ్రహాలకు మూలాలను వివరించారు.

వ్యాధులకు దీర్ఘకాలిక చికిత్సలవల్ల దేశవ్యాప్తంగా ఏటా ఆరుకోట్ల మంది పేదరికంలోకి దిగజారిపోతున్నరని డాక్టర్ జయప్రకాష్ వివరించారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఇందుకు పరిష్కారంగా కనిపించినా అది తాత్కాలికమేనని, ప్రజారోగ్య సంరక్షణలో దశలవారీ సదుపాయాయాలు నిర్వహణలను మరచిపోవడమే అసలు సమస్య అన్నారు.

ప్రాధమిక మాధ్యమిక స్థాయిలో ప్రజారోగ్యాన్ని విస్మరించి

సూపర్ స్పెషాలిటీ స్ధాయిలోనే వైద్యవసతులను అభివృద్ధిచేయడం వల్ల భారతదేశంలో ప్రజారోగ్య సంరక్షణ ఖర్చు ఎక్కువ ఫలితం తక్కువగా తయారైందని వివరించారు.

డాక్టర్లు గ్రామాలకు వెళ్ళడం లేదని పార్టీలకు అతీతంగా అందరు రాజకీయనాయకులూ చెబుతున్నది నిజంకాదని, వైద్యం చేయడానికే చదువుకున్న డాక్టర్లకు తగిన జీతం ఇస్తే గ్రామాల్లో చికిత్సలు చేయడానికి వైద్యులు సిద్ధమేని అందుకు వీలుగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల స్ధాయిని పెంచాలని అన్నారు.

జిఎస్ఎల్ సంస్థల వ్యవస్ధాపకుడు డాక్టర్ గన్ని భాస్కరరావు, డీన్ బ్రిగేడియర్ డాక్టర్ వై వి శర్మ, మెడికల్ సూపరింటెండెంట్ బ్రిగేడియర్ డాక్టర్ టివిఎస్ పి మూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here