ప్రెస్ నోట్ 21/03/2018
రెవిన్యూ ఉద్యోగులకు
జిఎస్ఎల్ హాస్పిటల్ లో ఉచిత వైద్య పరీక్షలు
రెవిన్యూ శాఖలో 40 సంవత్సరాల వయసు పైబడిన ఉద్యోగులు జి ఎస్ ఎల్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని ఈ మేరకు ఆస్పత్రి యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నామని సబ్ కలెక్టర్ సాయికాంత్ వర్మ చెప్పారు
40 ఏళ్ళ వయసు పైబడిన రెవిన్యూ ఉద్యోగుల తమ భార్య లేదా భర్త తో సహా ఈ సదుపాయం పొందడానికి అర్హులని రోజుకు 20 మంది చొప్పున ఏప్రిల్ 20 వరకూ ఉచిత వైద్య పరీక్షలను నిర్వహిస్తారని వివరించారు
జి ఎస్ ఎల్ జనరల్ హాస్పిటల్ లో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో సబ్ కలెక్టర్ జ్యోతిని వెలిగించి ఈ పధకాన్ని ప్రారంభంభిచారు.
ప్రభుత్వ పధకాలను అమలు చేయడంలో మాత్రమేకాక సేవా కార్యక్రమాలను అమలు చేయడంలోనూ తాము ప్రభుత్వ సిబ్బందికి అండదండలుగా వుండగలమని జిఎస్ఎల్ సంస్ధల మెంటార్ డాక్టర్ గన్ని భాస్కరరావు వివరించారు.
మెడికల్ కాలేజి డీన్ బ్రిగేడియర్ డాక్టర్ వైవి శర్మ, మెడికల్ సూపరింటెండెంట్ బ్రిగేడియర్ డాక్టర్ టివిఎస్ పి మూర్తి, తాసిల్దార్లు సత్యవతీ దేవి, రాజేశ్వరరావు, పోశయ్య, డిప్యూటీ తాసిల్దార్లు రామకృష్ణ, బాపిరాజు, రెవిన్యూ ఉద్యోగుల నాయకులు జెడి కిషోర్, కెవి రమణ తదితరులు పాల్గొన్నారు.