కేన్సర్ పోకడలపై వర్క్ షాప్

0
1977

కేన్సర్లను నయం చేయడానికి ఇచ్చే రేడియేషన్ సంబంధించిన వేర్వేరు అంశాలపై నాలుగు రోజుల కోర్సు జిఎస్ఎస్ మెడికల్ కాలేజిలో బుధవారం సాయంత్రం ముగిసింది. దేశం నలుమూలల నుంచీ 125 మంది డాక్టర్లు పాల్గొన్న ఈ వర్క్ షాపులో యూరప్ నుంచి ఇద్దరు ప్రొఫెసర్లు వీడియో కాన్ఫరెన్సు ద్వారా కూడా కోర్సు నిర్వహించారు.

ఎ ఆర్ ఒ ఐ ( అసోసియేషన్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్స్ ఆఫ్ ఇండియా) ఇ ఎస్ టి ఆర్ ఒ ( యూరోపియన్ సొసైటీ ఫర్ రేడియోధెరపీ అండ్ ఆంకాలజీ ) సంస్ధలు ఈ కోర్సు వర్క్ షాపు నిర్వహించగా జిఎస్ఎల్ మెడికల్ కాలేజి ఆతిథ్యం ఇచ్చింది.

క్లినికల్ నిర్ధారణ లో హేతుబద్ధత ఆధారాలు, కేన్సర్ కణాలు వున్నచోటుని ఖచ్చితంగా అంచనా వేయడంలో ఇబ్బందులు సవాళ్ళు, చక్కదిద్దే మార్గాలు, మోతాదు నిర్ధారణలో సమస్యలు, తల మెడ భాగాలలో రేడియేషన్ ఇవ్వడంలో కొత్త టెక్నాలజీల ప్రభావాలపై కోర్సులు జరిగాయి.

ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు, జిఎస్ఎల్ మెడికల్ కాలేజి రేడియేషన్ ఆంకాలజీ అధిపతి డాక్టర్ ఆనందరావు, డాక్టర్లు శివశంకర్, అనూష, చంద్రశేఖరరావు తదితరులు కాక్యక్రమాన్ని సమన్వయం చేశారు.

వర్క్ షాప్ కి వచ్చిన కొందరి అభిప్రాయాలు:

1. డాక్టర్ ఆండ్రూహోప్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, ప్రిన్సెస్ మార్గరెట్ హాస్పిటల్, టొరంటో – కెనడా

“నేను చాలా వర్క్ షాపులు చూశాను. ఇక్కడ నేర్చుకున్నది చాలా బావుంది. ఇది గొప్ప విజ్ఞాన సమ్మేళనం అనిపించింది. పవర్ ఫెయిల్ అయిన విషయం అర్ధమయ్యేలోపునే కేవలం కొద్ది సెకెన్లలోనే కరెంటు వచ్చేసేది. వర్క్ షాపు / కోర్సుకి ఏమాత్రం అంతరాయమే లేదు. ఈ కాలేజి ఏర్పరచుకున్న శాశ్వత మౌలిక వసతుల వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇందుకు యాజమాన్యాన్ని అభినందిస్తున్నా!

ఈ నగరంలో గోదావరి హారతి కూడా చూశాము. బొటు పై నీటిలో తేలుతూ పండితులు మంత్రాలతో వెలుగుద్వారా నదిని పూజించడం అద్భుతమైన దృశ్యం”

2. మిఖా పాల్ము, ప్రాజెక్టు మేనేజర్, ఇ ఎస్ టి ఆర్ ఒ , బెల్జియమ్

“వీడియో కాన్ఫరెన్సులు పూర్ కనెక్టివిటీ వల్ల ఇబ్బంది పెడుతాయి. సిటీకి దూరంగా వున్నా కూడా ఇక్కడ ఆ సమస్య రాకపోవడం ఆశ్చర్యం! కనెక్టివిటీ బాగుండటానికి మంచి ఏర్పాటు చేశారు. వారు సదుపాయాల్లో కానీ, అతిధులకు ఏర్పాట్ల విషయంలో కానీ, చిన్న చిన్న అంశాలను కూడా బాగా శ్రద్ధపెట్టడం వల్లే సంతృప్తిగా వెళ్ళిపోతున్నాము”

3. డాక్టర్ జి వి గిరి, బెంగుళూరు, కార్యదర్శి, ఎ ఆర్ ఒ ఐ

“ఈ కాలేజి వాళ్ళు చేసిన ఏర్పాట్లు, ఇక్కడ వున్న వసతులు ఏ విధంగా చూసినా అంతర్జాతీయ ప్రమాణాలకు తీసిపోవు. ఇంతటి మెడికల్, సర్జికల్ సిములేషన్ లేబొరేటరీ ఇండియాలో ఎక్కడా లేదు. అవగాహన కల్పించే, పెంచే ఇలాంటి వర్క్ షాపులను ముఖ్యంగా మెడికోలు మిస్ కాకుండా చూసుకోవాలి. ఇది కేవలం నేర్చుకోవడం కాదు, ఇది గొప్ప అనుభవం”

4. డాక్టర్ హారిక, యశోద హాస్పిటల్ హైదరాబాద్

“వర్క్ షాపుల నిర్వహణలో ఇదొక కొత్త విధానం. సుళువుగా కొత్త విషయాలు తెలుసుకోగలిగాము. నిర్వాహకులకు అభినందనలు”

5. డాక్టర్ సందేష్ ఎం ఎన్ జె హాస్పిటల్ హైదరాబాద్

“కొన్ని టాపిక్ లమీద వర్క్ షాపులో ఏర్పాటు చేసిన “హాండ్స్ అన్ స్కిల్స్” వృత్తిగత, వ్యక్తిగత జీవితాల్లో గొప్ప అనుభవం. సుళువులు కొత్త విధానాలు సిలబస్ లోనో, రోజువారీ ప్రాక్టీసులోనో వుండవు. ఇలాంటి వర్క్ షాపుల్లోనే అనుభవమౌతాయి. ధాంక్స్”

6. డాక్టర్ ఎం కె బనాల్, మాక్స్ హాస్పిటల్ – ఢిల్లీ

“నేను ఎన్నో వర్క్ షాపులకు వెళ్లాను. నేర్చుకోవడం అత్యంత సునాయాసంగా సుళువుగా ముగిసిన వర్క్ షాప్ ఇదే! మౌలిక సదుపాయాలు, కాన్ఫరెన్సుల అనుభవం, ఏర్పాట్లలో సమన్వయాలవల్లే ఇదంతా సాధ్యమౌతుంది”

7. డాక్టర్ కుమారి, అసిస్టెంట్ ప్రొఫెసర్, కర్నూలు మెడికల్ కాలేజి

“రేడియేషన్ ధెరపీలో పాతవాటికి బదులుగా కొత్తటెక్నిక్ లను తెలుసుకోడానికి ఇది బాగా వుపయోగపడింది. విషయాన్ని వివరించిన పద్ధతీ, ప్రజెంటేషన్లూ బాగున్నాయి. ఇంట్రాక్షన్ బాగుంది”

8. డాక్టర్ కర్రా ప్రదీప్, శాంతి హాస్పిటల్, భీమవరం

“జూనియర్లయినా సీనియర్లయునా వైద్య చికిత్సా ధోరణులపై అప్ డేట్ అవ్వడానికి ఇలాంటి వర్క్ షాపులు, కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లు చాలా అవసరం. డాక్టర్ గన్ని భాస్కర రావుగారు గొప్ప సర్జన్ మాత్రమే కాదు. గొప్ప అకడమీషియన్ కూడా! ఏదో ఒక డిపార్టుమెంటు కి సంబందించి ఇలాంటి జాతీయ, రాష్ట్ర స్ధాయి వర్క్ షాపులు ప్రతీనెలా ఆయన కాలేజీలో నిర్వహిస్తూనే వుంటారు”

9. డాక్టర్ నీహారిక పండా, రేడియేషన్ ఆంకాలజీ హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంటు, రీజనల్ కేన్సర్ సెంటర్ కోల్ కత్తా

“వర్క్ షాపు విజయవంతమైంది. నేర్చుకోడానికి అన్ని విధాలా అనువైన వాతావరణాన్ని అంటే ప్రతి చిన్న విషయాన్ని నిర్వాహకులు ముందే ఊహించి తగిన ఏర్పాట్లు చేశారు. డెలిగేట్లకు కొత్తచోటులో సహజంగా వుండే ఇబ్బందిని తొలగించి సౌకర్యంగా వుండడంత మీద నిర్వాహకులు దృష్టి పెట్టారు. ఫలితంగా బెరుకు కొత్త అనిపించకుండా ఇంట్లో వుండే కొత్త విషయాలు తెలుసుకున్న అనుభవం మిగిలింది”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here