రేడియేషన్ పై కొత్తటెక్నాలజీలు

0
1563

రేడియేషన్ పై కొత్తటెక్నాలజీలు

జిఎస్ఎల్ లో 4 రోజుల వర్క్ షాపు

దేశం నలుమూలల నుంచీ 85 మంది కేన్సర్ డాక్టర్ల రాక!

రేడియేషన్ ద్వారా కేన్సర్ ని నయం చేసే అధునాతన టెక్నాలజీలపై డాక్టర్లలో కొత్త అవగాహన కలిగించడానికి అక్టోబర్ 7 ఆదివారం నుంచి 4 రోజులపాటు రాజానగరం వద్దగల జిఎస్ఎల్ మెడికల్ కాలేజిలో జరిగే వర్క్ షాపునకు దేశం నలుమూలల నుంచీ 85 మంది, యూరప్ నుంచి నలుగురు హాజరౌతున్నారని ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు చెప్పారు.

ఎ ఆర్ ఒ ఐ ( అసోసియేషన్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్స్ ఆఫ్ ఇండియా) ఇ ఎస్ టి ఆర్ ఒ ( యూరోపియన్ సొసైటీ ఫర్ రేడియోధెరపీ అండ్ ఆంకాలజీ ) సంస్ధలు ఈ కోర్సు వర్క్ షాపుని నిర్వహిస్తున్నాయని ఆయన ఈ కార్యక్రమం జరిగే అధునాతన కాన్ఫరెన్స్ హాల్ “వీరేశలింగం లాంజ్” లో శనివారం మధ్యాహం విలేకరులకు వివరించారు.

వ్యాధి నిర్ధారణ, చికిత్సా రంగాలలో ఎలక్ట్రానిక్స్, కంప్యూటింగ్ పాత్ర ప్రమేయం విశేషంగా పెరిగిపోవడం వల్ల వాటివినియోగంపై పాతతరం డాక్టర్లకూ, ఈ తరం డాక్టర్లకూ అవగాహనలు కల్పించడం, పెంపొందించడం ఇటువంటి వర్క్ షాపులకు సాధ్యమని రేడియేషన్ ఆంకాలజీ విభాగం అధిపతి డాక్టర్ పిబి ఆనందరావు వివరించారు.

కేన్సర్ కణాలను మినహా పక్కనే వున్న ఆరోగ్యవంతమైన కణాలకు హానిజరగని తీరులో రేడియేషన్ ఇవ్వడం వేగంగా మారిపోతున్న టెక్నాలజీలవల్ల సులభమౌతోందని అదే విభాగం ప్రొఫెసర్ డాక్టర్ కె శివశంకర్ వివరించారు.

వర్క్ షాపు ని ఆన్ లైన్ లో యూరప్ కు అనుసంధానం చేయడానికి వచ్చిన – మికాపాల్ము “ వర్క్ షాప్ ఏర్పాట్లు అంతర్జాతీయ ప్రమాణాలకు ఏ మాత్రం తక్కువగా లేవు అని ప్రశంసించారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ అనూష, డాక్టర్ చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here