నెప్పిలేని మత్తునుంచి ప్రాణరక్షణ వరకూ…

0
2077

…అనస్ధీషియాపై సిఎంఇ

శస్త్రచికిత్సలలో నొప్పితెలియనివ్వని చికిత్సతో మొదలై ఊపిరి ఆగిపోకుండా చూసే అత్యవసర ప్రాణ రక్షణ చికిత్స వరకూ శాఖోపశాఖలుగా విస్తరించిన వైద్యశాస్త్రం “అనస్ధీషియాలజీ” పై జిఎస్ఎల్ మెడికల్ కాలేజి లో జరిగిన సిఎంఇ (కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్) లో ఆంధ్రప్రదేశ్ లోని 12 మెడికల్ కాలేజిలనుంచి 250 మంది డాక్టర్లు పాల్గొన్నారు. వీరిలో ఈ శాస్త్రం లో పోస్టుగ్రాడ్యుయేషన్ చదువుతున్న జూనియర్ డాక్టర్లు, వేర్వేరు చోట్ల అనస్ధీషియన్లు గా వున్న ప్రాక్టీసింగ్ డాక్టర్లు వున్నారు.

ముఖ్యఅతిధి ఐఎస్ఎ జాతీయ చైర్మన్ డాక్టర్ డాక్టర్ కుచేలబాబు జ్యోతి వెలిగించి సిఎంఇ ని ప్రారంభించారు.

మెడికల్ ఎలక్ట్రానిక్స్, బయోఇంజనీరింగ్ పరిశ్రమలు ఉత్పత్తి చేస్తున్న పరికరాలు అనస్ధీషియా విభాగాల్లో వినియోగమౌతున్న తీరుతెన్నుల్ని సిఎంలో పరిచయం చేశారు. సమీక్షించారు. విశ్లేషించారు

ఐఎస్ఎ (ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్ధీషియాలజిస్ట్స్), ఆ సంస్ధ రాజమండ్రి బ్రాంచి సహకారంతో ఆదివారం సాయంత్రం వరకూ రోజంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

అడ్వాన్స్డ్ అనస్ధీషియాలజీ లో 9 విభాగాలుగా జరిగిన ఈ సిఎంఇ లలో కర్నాటక, తమిణనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన సీనియర్ డాక్టర్లు ప్రజెంటేషన్లు ఇచ్చారు.

రాజమండ్రి డాక్టర్లు బ్రహ్మాజీ, రెడ్డి ప్రసాద్, వేణుగోపాల్, కాకినాడ డాక్టర్ చక్రరావు, జిఎస్ఎల్ మెడికల్ కాలేజి నుంచి డాక్టర్లు ప్రతాప్, బ్రిగేడియర్ టవిఎస్ పి మూర్తి తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here