48 ఏళ్ళ అనుభవంతో నాయర్ పిలుపు
విషయాన్ని వెనువెంటనే వివరించడానికి అత్యున్నత సాధనమైన సోషల్ మీడియా, వెబ్ సైట్ టెక్నాలజీలపై పరిచయం పెంచుకోవాలని, పారదర్శకతకు ఇది ఒక సాక్ష్యంగా కూడా ఉపయోగపడుతుందని డెంటిస్ట్రీలో సర్జన్ గా టీచర్ గా 48 సంవత్సరాలనుంచీ అనుభవాలు పండించుకుంటున్న ప్రొఫెసర్, డాక్టర్ కె చంద్రశేఖరన్ నాయర్ దంత వైద్యులకు, దంత వైద్య శాస్త్ర విద్యార్ధులకు పిలుపు ఇచ్చారు.
జిఎస్ఎల్ డెంటల్ కాలేజి మొదటి గ్రాడ్యుయేషన్ డే వేడుకలో శనివారం సాయంత్రం ముఖ్యఅతిధిగా ఈ సందేశమిచ్చారు. మొదటి బ్యాచ్ గ్రాడ్యుయేట్లకు డిగ్రీ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.
దంతవైద్యం అవధులు, పరిధులు ఎంతగానో విస్తరించాయని, చెవి ముక్కు గొంతు సమస్యలను కూడా డెంటల్ సర్జన్లు చక్కదిద్దగల విధంగా ఈ శాస్త్రం విస్తరించి వివరాలు ప్రస్తావించారు.
అధ్యక్షత వహించిన జిఎస్ఎల్ సంస్ధల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు మాట్లాడుతూ పూర్వ విద్యార్ధుల మధ్య అనుసంధానం కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ప్రారంభిస్తున్నామన్నారు.
ప్రిన్సిపాల్ డాక్టర్ గంటా సునీల్ నివేదిక ఇచ్చారు. డెంటల్ కాలేజీలలో అమ్మాయిల సంఖ్య హెచ్చుగా వుంటున్నప్పటికీ డాక్టర్ల సంఖ్యలో అబ్బాయిల సంఖ్యే హెచ్చుగా కనబడుతున్నదనీ, ప్రాక్టీసు పరంగా విద్యార్ధి దశనుంచే అమ్మాయిలు ఫోకస్ పెడితే ప్రాక్టీసింగ్ డెంటల్ సర్జన్లలో అబ్బాయిల సంఖ్యను వారు ఎన్నోరెట్లు అధిగమించగలరని వివరించారు.